: టీఆర్ఎస్ అండదండలతోనే నయీమ్ దందా: మధు యాష్కీ
టీఆర్ఎస్ అండదండలతోనే గ్యాంగ్ స్టర్ నయీమ్ తన దందాలు నడిపించాడని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధు యాష్కీ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గడచిన రెండేళ్లుగా టీఆర్ఎస్ నేతలు, అధికారుల అండతోనే నయీమ్ రెచ్చిపోయాడని, విచ్చలవిడిగా తిరిగాడని ఆరోపించారు. అధికార పార్టీ నేతల భూదందాల నేపథ్యంలోనే నయీమ్ ఎన్ కౌంటర్ జరిగిందన్నారు. నయీమ్ కేసు నుంచి అధికార పార్టీకి చెందిన నేతలను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీల హయాంలో నయీమ్ ను ప్రోత్సహించారని ఆరోపిస్తున్న టీఆర్ ఎస్, రెండేళ్లుగా అధికారంలో ఉండి ఏం చేస్తోందని ప్రశ్నించారు.