: టీజేఏసీపై నిఘా పెట్టడం కంటే ఇలాంటి వారిపై నిఘా పెట్టడం మంచిది: ‘నయీమ్ కేసు’పై స్పందించిన కోదండరాం
పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు అంశంలో టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం స్పందించారు. కేసులో సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులకి లభ్యమైన నయీమ్ డైరీలో ఉన్న వివరాలన్నింటిపైన పూర్తి విచారణ జరిపించాలని ఆయన అన్నారు. నేరస్తులతో రాజకీయనేతలు సన్నిహితంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. టీజేఏసీపై నిఘా పెట్టడం కంటే ఇలాంటి వారిపై నిఘా పెట్టడం మంచిదని వ్యాఖ్యానించారు. జేఏసీ కార్యకలాపాలన్నీ బహిరంగమేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.