: కేరళ ముఖ్యమంత్రికి సెల్ఫీ వీడియో ద్వారా సూచన చేసిన సినీనటుడు... స్పందించిన సీఎం!


మలయాళ నటుడు జయసూర్య కేరళలో రోడ్ల పరిస్థితిని వివరిస్తూ తీసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. జయసూర్య ఆగస్టు 8న తన కార్లో వెళ్తుండగా... రోడ్లపై ఏర్పడ్డ గుంతల కారణంగా బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రోడ్లను నిర్వహించే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ జయసూర్య ఒక సెల్ఫీ వీడియోను తీశాడు. ట్యాక్సులు పే చేస్తున్నవారు కూడా ఈ గుంతల్లో పడి గాయపడుతున్నారని, రోడ్లను పట్టించుకునే నాథుడు లేడని, మౌలిక సదుపాయాలు కూడా కల్పించకపోతే ప్రభుత్వాలు ఉండేది ఎందుకని నిలదీస్తూ తను చూసిన సన్నివేశం గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ తీసిన సెల్పీ వీడియోను తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చేశాడు. దీనిని 11 లక్షల మంది చూడగా, 35 వేల మంది షేర్ చేశారు. అలా ఇది కేరళ ముఖ్యమంత్రి విజయన్ కు చేరింది. దీనిని చూసిన ఆయన జయసూర్యకు సమాధానం పంపారు. తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉందని తెలిపారు. ప్రభుత్వం ప్రతిఏటా రోడ్ల మరమ్మతులకు, మంచి రవాణా సౌకర్యాలకు వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News