: కేసీఆర్‌, హరీశ్‌రావులే తెలంగాణ ద్రోహులు: జగ్గారెడ్డి


మల్లన్నసాగర్ బాధితులకు మద్దతుగా సంగారెడ్డిలో దీక్ష‌కు దిగిన తనను తెలంగాణ ద్రోహి అంటూ టీఆర్ఎస్ నేత‌లు విమర్శించడం ప‌ట్ల కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిప‌డ్డారు. ఈరోజు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ... భూసేక‌రణ కోసం తెలంగాణ ప్ర‌భుత్వం 123 జీవోను ఎలాగైనా అమలు చేయాలని అనుకుంటోంద‌ని ఆరోపించారు. తెలంగాణ‌లో కొన‌సాగుతున్న‌ కేసీఆర్‌ది గాంధీ పాలనా? లేక‌ గాడ్సే పాలనా? అని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. శాంతియుతంగా చేస్తోన్న నిర‌స‌న‌ల‌ను ఎందుకు అణ‌చివేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణ మంత్రులు కడియం, తుమ్మల, తలసాని, మహేందర్‌రెడ్డి ద్రోహులు కారా? అంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆంధ్రా కాంట్రాక్ట‌ర్ల ప‌ట్ల సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులే తెలంగాణ ద్రోహులని ఆయ‌న విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News