: 25వ తేదీ వరకు రైల్వే రిజర్వేషన్లన్నీ ఫుల్
రేపటి నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానుండడంతో రైల్వే రిజర్వేషన్లన్నీ ఫుల్ అయిపోయాయి. పుష్కరాలకు తోడు, వరుసగా మూడు రోజుల సెలవు దినాలు రావడంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు రైల్వే రిజర్వేషన్లు ఖాళీ లేవు. ప్రత్యేక రైళ్ల లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తత్కాల్ టికెట్ల విషయానికొస్తే, అవి ప్రారంభించిన కొన్ని నిమిషాలకే ఖాళీ అయిపోతున్నాయి. దీంతో, ప్రైవేటు బస్సుల యజమానులు టిక్కెట్ల ధరలను పెంచేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రయాణికులు అధిక మొత్తం చెల్లించి టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది.