: ఏపీలో కృష్ణా పుష్కరాల హెల్ప్ లైన్ ఏర్పాటు


ఏపీలో కృష్ణా పుష్కరాల హెల్ప్ లైన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పుష్కర యాత్రికులకు 8333981170 అనే నంబర్ ను అందుబాటులో ఉంచారు. ఈ హెల్ప్ లైన్ సేవలను గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ స్వయంగా పర్యవేక్షిస్తారు. కాగా, రేపటి నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, మరికాసేపట్లో పుష్కర శోభాయాత్ర ప్రారంభం కానుంది. విజయవాడలోని ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు నుంచి పవిత్ర సంగమం వరకు ఈ యాత్ర కొనసాగుతుంది.

  • Loading...

More Telugu News