: న్యూజెర్సీలో తెలంగాణ యువకుడి సాహసం... 14,500 అడుగుల ఎత్తునుంచి స్కై డైవింగ్
అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ యువకుడు సాహసం చేశాడు. 14,500 అడుగుల ఎత్తునుంచి స్కై డైవింగ్ చేసిన విలాస్‌రెడ్డి అనే యువకుడు అందరినీ ఆకట్టుకున్నాడు. న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడిపోయినప్పటికీ తన మాతృదేశ ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. స్కై డైవింగ్ చేస్తూ వందేమాతరం, భారత్ మాతాకీ జై, జై తెలంగాణ నినాదాలు చేశాడు. కొత్త రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని ఆకాంక్షించాడు. భారత్-అమెరికా మధ్య మరింతగా సత్సంబంధాలు కొనసాగాలని అన్నాడు.