: గ్రీన్ ట్రైబ్యునల్‌పై మండిపడ్డ 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' రవిశంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ వరల్డ్ కల్చర్ ఫెస్టివల్ పేరుతో యమునా నది తీరాన వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిని పరిశీలించిన నిపుణుల కమిటీ ఆ ప్రాంతంలో కాలుష్యం జరిగి, ఆ పరీవాహక ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నట్లు నిన్న నివేదిక ఇచ్చింది. దీనికి మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) ఆదేశాలు జారీ చేసింది. దీనిపట్ల రవిశంకర్ ఈరోజు సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీ పక్షపాతంగా వ్యవహరించిందని విరుచుకుపడ్డారు. కమిటీ ఇచ్చిన నివేదిక అవాస్తవాలతో కూడి వుందని, దానికి వ్యతిరేకంగా తాము పోరాడతామని ఆయన పేర్కొన్నారు.