: రేపు హైదరాబాదు రానున్న నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా హైదరాబాదుకు రానున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందజేయాల్సిన సంక్షేమ కార్యక్రమాల నిధుల గురించి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించనున్నారు. వీరిద్దరి సమావేశం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలపై చర్చించనున్నారు. అరవింద్ పనగారియా రాకతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడ్ని కలిసేందుకు అంతా హస్తిన వెళ్తుండగా, ఆయనే హైదరాబాదు రానుండడం ఆసక్తి రేపుతోంది.