: జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పేరు మర్చిపోయిన సల్మాన్ ఖాన్!


ప్రముఖ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పేరును బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మర్చిపోయాడు. ఆమె పేరు ఎవరికి తెలిసినా తెలియకపోయినా మీడియా పెద్దగా పట్టించుకునేది కాదేమో కానీ, రియో ఒలింపిక్స్ కు భారత్ తరపున గుడ్ విల్ అంబాసిడర్ అయిన సల్మాన్ మర్చిపోవడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే, త్వరలో విడుదల కానున్న బాలీవుడ్ చిత్రం ‘ఫ్రీక్ అలీ’ ట్రయిలర్ లాంచ్ కార్యక్రమంలో సల్మాన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ‘రియో’ లో జిమ్నాస్టిక్స్ ఫైనల్ కు చేరిన భారత్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ గురించి సల్మాన్ ను విలేకరులు ప్రశ్నించగా, ‘బహుశ ఆ అమ్మాయి దీపిక అనుకుంటా. బంగారు పతకం సాధించాల్సింది కానీ, 8వ స్థానంలో నిలిచింది, కదా?’ అని సల్మాన్ చెప్పడంతో అది కరెక్టు కాదని విలేకరులు చెప్పినప్పటికీ కండల వీరుడు గ్రహించలేకపోయాడు. మళ్లీ వెంటనే సల్మాన్ స్పందిస్తూ,‘ఓ.. ఎస్, దీప్తి’ అంటూ మరోసారి దీపా కర్మాకర్ పేరు తప్పుగా చెప్పాడు. కాగా, ఒలింపిక్స్ లో జిమ్నాస్టిక్స్ ఫైనల్ కు వెళ్లిన తొలి భారత మహిళ దీపా కర్మాకర్. ఈ నెల 14న ‘రియో’ లో ఫైనల్ పోరుకు దిగనుంది.

  • Loading...

More Telugu News