: యువతను ఆకట్టుకునేందుకు ఐఎస్ కొత్త వ్యూహాలు!


యువతకు ఎర వేసేందుకు ఉగ్రవాద సంస్థ ఐఎస్ కొత్త వ్యూహాలు పన్నుతోంది. ఈ వ్యూహాల్లో భాగంగా హాలీవుడ్ తరహా నటన, మ్యూజిక్ తో కూడిన వీడియోలతో యువతకు ఎర వేస్తోందని ఒక నివేదిక వెల్లడించింది. ఫ్రెంచ్ మాట్లాడే ఐఎస్ టెర్రరిస్టుల్లో సుమారు 80 శాతం మంది ఈ తరహా వీడియోలకు ఆకర్షితులైన వారేనని ఫ్రెంచ్ అధికారులు చెబుతున్నారు. ‘సూపర్ జిహాదీ’ పేరిట ఫ్రాన్స్ నుంచి విడుదలైన హాలీవుడ్ స్ట్రైల్ వీడియోలు వారిని బాగా ఆకర్షించాయని పేర్కొన్నారు. ప్రత్యేక ఎడిటింగ్, ర్యాప్ మ్యూజిక్ తో ఈ వీడియోలను రూపొందించారన్నారు. ఈఫిల్ టవర్ పై వచ్చిన ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ అనే వీడియో గేమ్ నుంచి సేకరించిన గ్రాఫిక్స్ తో యువతను ఆకట్టుకునే విధంగా ఐఎస్ అనుకూల గ్రూప్ అల్-వాద్ మీడియా ప్రొడక్షన్ రూపొందించిన ఒక వీడియో ఏప్రిల్ నెలలో బయటకు వచ్చింది. ఈ వీడియోకు పలువురు యువత ఆకర్షితులయ్యారని సమాచారం.

  • Loading...

More Telugu News