: నేనంటే బర్రెలు పడిచస్తాయి... అవి నా ఫ్యాన్స్!: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్


బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అభిమానుల్లో తాజాగా బర్రెలు కూడా చేరిపోయాట. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమారే తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. మామూలుగా సినిమా తారలకు అభిమానులు ఉంటారని, తన విషయంలో మనుషులే కాకుండా బర్రెలు కూడా అభిమానుల జాబితాలో చేరిపోయాయంటూ పేర్కొన్నాడు. తాను ఎక్కడికి వెళితే అక్కడికి బర్రెలు వచ్చేస్తున్నాయని, తన కారు వెంట ఫాలో అవుతున్నాయని, అందుకే, తాను కూడా వాటిపై ప్రేమ చూపిస్తున్నానంటూ చెప్పాడు. అందుకు సంబంధించిన ఓ ఫోటోను కూడా ఆయన పోస్ట్ చేశాడు. రోడ్డుపై అక్షయ్ కారులో వెళుతుంటే... ఆయన కారు వెనుక రెండు, మూడు బర్రెలు ఉండటం ఆ ఫొటోలో కనిపిస్తోంది. ‘పీపుల్ హ్యావ్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఐ హ్యావ్ బుల్ ఫాలోయింగ్...’ అంటూ ఆ ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News