: అలంపూర్ బయలుదేరిన సీఎం కేసీఆర్
రేపటి నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు తన నివాసం నుంచి ప్రత్యేక బస్సులో రోడ్డు మార్గంలో మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ కు బయలుదేరారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. అలంపూర్ లోని హరిత టూరిజం అతిథిగృహంలో ఈ రాత్రికి ఆయన బస చేస్తారు. గొందిమళ్లలో రేపు ఉదయం 6 గంటలకు కృష్ణా నదిలో పుష్కర స్నానం చేసి జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అల్పాహారం అనంతరం అలంపూర్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో హైదరాబాద్ బయలుదేరతారు. రేపటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జరగనున్న పుష్కరాల్లో సుమారు 3 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానం ఆచరిస్తారని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు.