: పుష్కరాలకు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలలో పాల్గొనేందుకు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు రాష్ట్రప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రతినిధిగా ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జూనియర్ ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి, పుష్కరాల ఆహ్వానపత్రం అందజేశారు. పుష్కరాల్లో పాల్గొనాలని ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించారు. ఆయన ఆహ్వానానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. కాగా, చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ తో టీడీపీ నేతలకు సంబంధాలు అంతగా లేవంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్వయంగా ఓ మంత్రిని పంపి ఆయనను ఆహ్వానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • Loading...

More Telugu News