: రాజకీయాల్లో మాధవరెడ్డి కుటుంబానికి ఎటువంటి మచ్చలేదు... మేము అండగా వుంటాం!: రేవంత్ రెడ్డి


గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నయీమ్ ఎన్ కౌంటర్ పై ప్రభుత్వం అధికారికంగా వివరాలు వెల్లడించలేదని, ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని అన్నారు. నయీమ్ వ్యవహారాలతో తమకేమీ సంబంధం లేదని చెబుతున్న ఎలిమినేటి మాధవరెడ్డి కుటుంబానికి తాము అండగా ఉంటామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాజకీయంగా అడ్డు తొలగించాలని ప్రభుత్వం చూస్తోందని, ఆ నేపథ్యంలో ఇటువంటి ఆరోపణలకు పాల్పడుతోందని అన్నారు. రాజకీయాల్లో మాధవరెడ్డి కుటుంబానికి ఎటువంటి మచ్చలేదన్నారు.

  • Loading...

More Telugu News