: పదో తరగతిలో ప్రేమలో పడి వంచనకు గురైన మెదక్ బాలిక


చిన్న వయసులోనే ఆకర్షణనే ప్రేమని భావించి సర్వస్వం అర్పించిన ఓ బాలిక నయ వంచనకు గురైన ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, చిన కొండూరుకు చెందిన ఓ బాలికకు గ్రామంలోని హైస్కూలులో టెన్త్ చదువుతున్న సమయంలో సిద్ధిపేటకు చెందిన సాబెర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఫోన్ సంభాషణలకూ వెళ్లి, ఆపై ప్రేమగా మారింది. సాబెర్ పట్ల తన ఆకర్షణనే, ఆ బాలిక ప్రేమనుకోగా, బాలికను మాయచేసిన సాబెర్, ఐదు నెలల నుంచి ఆమెను లోబరచుకుని శారీరక బంధాన్ని కొనసాగించాడు. ఫలితంగా బాలిక గర్భవతి అయింది. ఇంట్లో విషయం తెలుసుకుని యువకుడిని నిలదీయడంతో అతను పెళ్లికి నిరాకరించి మొహం చాటేశాడు. బాలిక, ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News