: నాంపల్లిలో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన.. ఉద్రిక్తత.. భారీగా ట్రాఫిక్ జామ్


హైదరాబాద్‌ నాంపల్లిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్‌ ముందు గ్రూప్-1 అభ్యర్థులు ఈరోజు ఆందోళన చేశారు. గతంలో ఇంటర్వ్యూలు చేసిన అభ్యర్థులకే ఉద్యోగాలు ఇవ్వాలని, గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు మళ్లీ నిర్వ‌హించొద్ద‌ని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కోరుతూ వారు నినాదాలు చేశారు. ఆందోళ‌నకు దిగిన అభ్య‌ర్థుల‌ను పోలీసులు అడ్డుకోవ‌డంతో, విద్యార్థులు రోడ్డెక్కి వారి నిర‌స‌న‌ను కొనసాగించారు. దీంతో నాంప‌ల్లి రోడ్డుపై వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయి భారీగా ట్రాపిక్ జామ్ ఏర్పడింది. ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్ర‌యత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News