: మా ఇంటిలో ల్యాండ్ ఫోనే లేదు!... నయీమ్ తో ఫోన్ సంభాషణల కథనాలపై ఉమామాధవరెడ్డి ఫైర్!


గ్రేహౌండ్స్ బుల్లెట్లకు హతమైపోయిన గ్యాంగ్ స్టర్ నయీమ్ తనకు వందల సార్లు ఫోన్ చేసినట్లు వచ్చిన వార్తలపై టీ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా నేటి పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. తన భర్త బతికి ఉన్నప్పుడు తాము వినియోగించిన ఫోన్ నెంబర్ ను ఇప్పటికీ వాడుతున్నామని ఆమె చెప్పారు. ఇక ఉమ ఇంటిలోని ల్యాండ్ లైన్ నెంబరుకు కూడా నయీమ్ పలుమార్లు ఫోన్ చేశాడని పోలీసులు విచారణలో తేలినట్లు వచ్చిన కథనాలపై ఆమె మరింత ఘాటుగా స్పందించారు. తమ ఇంటిలో ల్యాండ్ లైనే లేకుండా ఫోన్లెలా వస్తాయని ఆమె మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు. పత్రికలకు లీకులిచ్చి కథనాలు రాయించడం కాదని, ఆధారాలుంటే కాల్ డేటాను బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News