: యూపీలో బీజేపీకి బూస్ట్!... ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ నుంచి 11 మంది ఎమ్మెల్యేల చేరిక నేడే!


వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి అన్నీ శుభ శకునాలే స్వాగతం పలుకుతున్నాయి. ఇప్పటికే బీఎస్పీ నుంచి బయటకొచ్చేసిన ఓబీసీ నేత, ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొన్నటిదాకా ప్రతిపక్ష నేతగా కొనసాగిన స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీలో చేరిపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరుకు ఆకర్షితుడయ్యానని చెప్పిన మౌర్య, ఆ కారణంగానే తాను బీజేపీలో చేరుతున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ తో పాటు యూపీలో ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు నేడు ‘కమలం ’ గూటికి చేరనున్నారు. ఇదే జరిగితే... యూపీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలే రానున్నాయన్న వాదనకు బలం చేకూరనుంది.

  • Loading...

More Telugu News