: జార్జిటౌన్ వర్సిటీ డైరెక్ట‌ర్‌గా తొలిసారి హిందూ గురువు నియామ‌కం


అమెరికాలోని జార్జిటౌన్ వర్సిటీలో ఓ విభాగ డైరెక్ట‌ర్‌గా హిందూ గురువు బ్రహ్మచారి వ్రజ్‌విహారీ శరణ్ నియ‌మితుల‌య్యారు. శరణ్ గ‌త ఏడాది వ‌ర‌కు ఎడిన్‌బర్గ్ వర్సిటీలో హిందూ మత గురువుగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. జార్జిటౌన్ వర్సిటీలో హిందూ గురువు నియ‌మితులు కావ‌డం ఇదే తొలిసారి. వ‌ర్సిటీలో లైఫ్ విభాగ డెరైక్టర్‌గా ఆయ‌న‌ను నియమిస్తున్నట్లు వర్సిటీ మిషన్ అండ్ మినిస్ట్రీ ఉపాధ్యక్షుడు రేవ్ హవార్డ్ గ్రే పేర్కొన్నారు. వర్సిటీలోని హిందువుల గ‌ళం వినిపించేందుకు ఆయ‌న‌ను డెరైక్టర్‌గా నియమించామని చెప్పారు.

  • Loading...

More Telugu News