: ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తే పెళ్లి చేసుకుంటా: ఇరోమ్ షర్మిల


ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ 16 ఏళ్లుగా కొన‌సాగించిన త‌న దీక్ష‌ను ఇరోం షర్మిల ఇటీవ‌లే విర‌మించిన సంగ‌తి తెలిసిందే. దీక్ష విర‌మ‌ణ సంద‌ర్భంగా ఎన్నిక‌ల్లో పోటీచేస్తాన‌ని, సీఎం కావాల‌నుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించిన ఆమె.. తాజాగా ఎన్నిక‌ల్లో ఓడితే పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడిపోతానని వ్యాఖ్యానించారు. కొత్త రీతిలో తాను చేయాల‌నుకుంటున్న ప్ర‌య‌త్నాన్ని ప్ర‌జ‌లు పట్టించుకోకపోయినా, వారి నుంచి త‌న‌కు అవమానాలు ఎదుర‌యినా అది తన జీవితంలో కొత్త అధ్యాయానికి నాందిగా మారుతుంద‌ని ఆమె ఆవేద‌న‌తో చెప్పారు. కాగా, వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ఆమె తౌబల్ నియోజకవర్గం నుంచి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నున్నారు. ప్రస్తుతం ఆ నియోజ‌కవ‌ర్గానికి సీఎం ఓక్రమ్ ఇబోబి సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె చేస్తోన్న‌ పోరాటం కొన‌సాగకుండా చేసేందుకే ష‌ర్మిల‌ను రాజకీయాల్లోకి దించేందుకు స‌ర్కారు కుట్ర పన్నిందని గ‌తంలో 'సేవ్ షర్మిల' అని నిన‌దించిన వారిలో కొంద‌రు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News