: కర్నూలు జిల్లాలో మావోయిస్టుల కలకలం!... అవుకు రిజర్వాయర్ వద్ద ఆరుగురు అరెస్ట్!
పవిత్ర కృష్ణా పుష్కరాలకు రాయలసీమలోని కర్నూలు జిల్లా దాదాపుగా ముస్తాబైంది. ఈ క్రమంలో నేటి ఉదయం జిల్లాలో మావోయిస్టుల కలకలం రేగింది. జిల్లాలోని అవుకు రిజర్వాయర్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పోలీసులు మావోయిస్టు దళ సభ్యులుగా అనుమానిస్తున్నారు. పుష్కరాల నేపథ్యంలో తామంతా పుష్కర ఘాట్ల వద్ద భద్రతా విధుల్లో ఉండగా, జిల్లాలో మళ్లీ గట్టి పునాది వేసుకునేందుకు మావోయిస్టులు రంగంలోకి దిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.