: ఒక్కో అమ్మాయికి నెలకు రూ. 7 లక్షల జీతంతో సెక్స్ రాకెట్... విస్తుపోయిన చెన్నై పోలీసులు


చెన్నై నగరంలో వెలుగులోకి వచ్చిన సెక్స్ రాకెట్ ఉదంతాన్ని చూసి పోలీసులే విస్తుపోతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను నెలవారీ ప్రాతిపదికన నగరానికి తెచ్చి వారికి నెలకు రూ. 7 లక్షలను వేతనంగా ఇస్తున్నారట. విమానాల్లో మాత్రమే తిరిగే ఈ అమ్మాయిలను ఫైవ్ స్టార్ హోటల్స్, లేదా డబ్బున్న బడాబాబుల వద్దకే పంపుతారట. నగరంలో విస్తృతంగా సాగుతున్న వ్యభిచార దందాకు అడ్డుకట్ట వేసేందుకు నిశ్చయించిన వ్యభిచార నిరోధక శాఖ అన్ని ఫైవ్ స్టార్ హోటళ్లపైనా దాడులు చేస్తోంది. వివిధ ప్రాంతాల్లోని వ్యభిచార గృహాల్లో సోదాలు జరుపుతూ, బ్రోకర్లను, యువతులను అరెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలో లేడీ సీఐ బుల్లెట్ రాజేశ్వరి, శంకర్ నారాయణన్ నేతృత్వంలోని బృందం, ఓ ప్రముఖ హోటల్ పైన, అనంతరం అక్కడ లభించిన ఆధారాలతో ఎంఆర్సీ నగర్ లోని ఓ ప్రముఖుడి ఇంట్లోను తనిఖీలు చేశారు. అక్కడ నలుగురు యువతులు, దిలీప్ సింగ్ ఫైజల్ అనే బ్రోకర్లను అరెస్ట్ చేసి విచారించారు. ముంబై, కోల్ కతా నగరాల యువతులకు నెలకు రూ. 7 లక్షలు ఇస్తున్నామని, వారి కాంట్రాక్టు పూర్తికాగానే పంపుతున్నామని వీరు వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తామని, కారుల్లో పంపుతుంటామని విచారణలో వీరు తెలిపినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News