: కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన నయీమ్!... పోలీసుల థర్డ్ డిగ్రీలో కడుపులో విరిగిన లాఠీ!

తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీమ్... చిన్నప్పటి నుంచి అందరిలోకి ప్రత్యేకంగా కనిపించాలని ఉబలాటపడేవాడు. ఈ క్రమంలో అతడు బాడీ బిల్డింగ్ పై అమితాసక్తి చూపాడు. కరాటేలో శిక్షణ తీసుకున్న అతడు బ్లాక్ బెల్ట్ ను కూడా సాధించాడు. ఆ తర్వాత ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో సభ్యత్వం తీసుకున్న నయీమ్... భువనగిరి పరిధిలో హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో ఆదిలోనే పోలీసులకు చిక్కిపోయిన నయీమ్ చిత్రహింసలు అనుభవించాడు. నక్సల్స్ పై నిషేధం కొనసాగుతున్న సమయంలో తమ చేతికి చిక్కిన నయీమ్ పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారట. ఇందులో భాగంగా అతడి మలద్వారం నుంచి కడుపు లోపలికి పోలీసులు ఓ లాఠీని చొప్పించారు. దానిని బయటకు తీసే క్రమంలో ఆ లాఠీ అతడి కడుపులో విరిగిపోయింది. వెరసి లాఠీకి చెందిన ఓ ముక్క అతడి కడుపులోనే ఉండిపోయిందట. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి తమ దళంలో చేరిన నయీమ్ కు ఆపరేషన్ చేయించిన నక్సల్స్ అతడి కడుపులో ఉన్న లాఠీ ముక్కను తీసివేయించారు. ఈ విషయాన్ని నయీమ్ తన అనుచరుల వద్ద పదే పదే ప్రస్తావించేవాడట.

More Telugu News