: గోదావరి అంత్య పుష్కరాలు నేటితో సమాప్తం!... రాజమహేంద్రిలో పుష్కరుడికి చంద్రబాబు వీడ్కోలు!
గోదావరి అంత్య పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. పవిత్ర గోదావరి అంత్య పుష్కరాలకు గోదావరి పరీవాహక పరిధిలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. నేడు చివరి రోజు కావడంతో గోదావరి నదిలో పుణ్యస్నానం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఇక గోదావరి అంత్య పుష్కరాలకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ముగింపు పలకనున్నారు. నేటి సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్ కు వెళ్లనున్న చంద్రబాబు పుష్కరుడికి హారతి ఇచ్చి వీడ్కోలు పలుకుతారు.