: 'ఇద్దరమ్మాయిలతో' ఆడియో సందడి మొదలైంది
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్.. తొలిసారిగా ఇద్దరు హీరోయిన్లతో నటిస్తున్న చిత్రం ఇద్దరమ్మాయిలతో. టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో పరమశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తోన్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరుగుతోంది. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అమలాపాల్, క్యాథరిన్ కథానాయికలుగా నటిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేశ్ ఈ సినిమాను రూ. 45 కోట్ల హెవీ బడ్జెట్ తో తెరకెక్కించడం విశేషం. ఈ చిత్రాన్ని వచ్చే నెల 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.