: భువనగిరి ఎమ్మెల్యేను నేనే!... అనుచరుల వద్ద గ్యాంగ్ స్టర్ నయీమ్ వ్యాఖ్యలు!
ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్ యూ) నేతగా ప్రస్థానం ప్రారంభించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవన శైలి విభిన్నంగా సాగింది. ఆర్ఎస్ యూ, ఆ తర్వాత నక్సల్స్ దళంలో చేరిన నయీమ్... ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్యలో కీలక భూమిక పోషించాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయి చివరకు గ్యాంగ్ స్టర్ గా మారాడు. నాలుగు రోజుల క్రితం అతడు పాలమూరు జిల్లా షాద్ నగర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ఈ క్రమంలో అతడు నిత్యం తన అనుచరుల వద్ద చేస్తున్న ఓ కీలక వ్యాఖ్య తాజాగా వెలుగు చూసింది. త్వరలోనే రాజకీయాల్లోకి వెళతానని అతడు తరచూ చెప్పేవాడట. నల్లగొండ జిల్లాలోని తన సొంతూరు భువనగిరి నియోజకవర్గానికి ఎప్పటికైనా తాను ఎమ్మెల్యేను అవుతానంటూ అతడు చెప్పేవాడట. ఈ క్రమంలోనే అతడు ప్రస్తుతం భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్న పైళ్ల శేఖర్ రెడ్డిని తీవ్రంగా బెదిరించాడని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.