: ఆర్టీఏ ఆఫీస్ లో నాగార్జున!... గడ్డంతో కొత్త లుక్ లో టాలీవుడ్ హీరో!


టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున నిన్న ఖైరతాబాదులోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఎప్పుడూ క్లీన్ షేవ్ తో కనిపించే నాగార్జున నిన్న ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చిన వేళ నిండా గడ్డంతో కనిపించారు. గతంలో వచ్చిన ‘క్రిమినల్’ చిత్రంలో నిండా గడ్డంతో కనిపించిన నాగార్జున... ‘అన్నమయ్య’, 'శిరిడీ సాయి' చిత్రాలలో చిన్నపాటి గడ్డంతో మాత్రమే కనిపించారు. ఈ సందర్భాలు మినహా నాగార్జున పూర్తి గడ్డంతో కనిపించిన దాఖలా లేదు. ఈ క్రమంలో నిన్న ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చిన సందర్భంగా గడ్డంతో కనిపించిన నాగార్జున... తన పాత చిత్రం ‘క్రిమినల్’ లుక్కులో కనిపించారు. ఇటీవలే తాను కొన్న కొత్త ఇన్నోవా కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్టీఏ ఆఫీస్ కు రాగా... అక్కడి అధికారులు ఆయన కారుకు ‘టీఎస్09 ఈఎన్ 9669’ నెంబరును కేటాయించారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా నిన్న ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన స్విఫ్ట్ డిజైర్ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చారు.

  • Loading...

More Telugu News