: సియాచిన్ లో సైనికులకు రాఖీలు కట్టనున్న స్మృతీ ఇరాని!
దేశానికి ఎనలేని సేవలందిస్తూ ఆత్మీయులకు దూరంగా ఉంటున్న సైనికులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపేందుకు కేంద్రమంత్రి స్మృతీ ఇరాని సియాచిన్ వెళ్లనున్నారు. ఈనెల 18న రక్షా బంధన్‌ను పురస్కరించుకుని ఆమె సియాచిన్ వెళ్లనున్నట్టు రక్షణమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. స్మృతీతోపాటు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, నీటి వనరుల మంత్రి ఉమా భారతి, స్త్రీ, శిశుసంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ, సహాయ మంత్రులు నిర్మలా సీతారామన్, సాధ్వి నిరజంన్ జ్యోతి, అనుప్రియ పటేల్ సరిహద్దులకు వెళ్లి మన సైనికులతో కలిసి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొననున్నారు.