: ప్రేమించిన యువతినే పెళ్లాడిన కేంద్ర మంత్రి సుప్రియో!... వేడుకకు హాజరైన మోదీ!
బీజేపీ నేత, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఓ ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకున్న ఆయన కొత్త వైవాహిక జీవితాన్ని ఆరంభించారు. మంగళవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన వేడుకలో తాను ప్రేమించిన ఎయిర్ హోస్టెస్ రచనా శర్మను ఆయన వివాహమాడారు. ఘనంగా జరిగిన ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు. విమాన ప్రయాణంలో భాగంగా ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న రచనా శర్మను తొలి చూపులోనే ఇష్టపడ్డ సుప్రియో ప్రేమాయణంపై గతంలో ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి. చాలాకాలం పాటు ప్రేమికులుగానే ఉన్న వీరిద్దరు పెళ్లి పేరిట కొత్త జీవితాన్ని ఆరంభించారు.