: రోడ్డెక్కిన జయనాగేశ్వరరెడ్డి!...‘హోదా’ కోసం సర్వ మత ప్రార్థనలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే!
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం చేసిన ప్రకటనతో వేచి చేసే ధోరణిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఉండగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం నిరసన జ్వాలలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కొందరు ఎమ్మెల్యేలు వినూత్న నిరసనలకు దిగుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ యువనేత, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి నిన్న తన సొంతూళ్లో వినూత్న నిరసనకు దిగారు. భారీ అనుచర గణంతో రోడ్డెక్కిన ఆయన పట్టణంలోని హిందూ దేవాలయం, మసీదు, చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రం మనసు మార్చాలని మూడు మతాలకు చెందిన దేవుళ్లను వేడుకున్నానని ఆయన పేర్కొన్నారు.