: కోహ్లీని చూసేందుకు విండీస్ వెళ్లిన అనుష్క!
టీమిండియా, బాలీవుడ్ ప్రేమ పక్షులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మళ్లీ కలుసుకున్నారు. వెస్టిండీస్ టూర్ లో ఉన్న కోహ్లీ ఒక టెస్టు విజయంతో జోరుమీదుండగా, సుల్తాన్ విజయంతో అనుష్క ఉబ్బితబ్బిబ్బవుతోంది. కరణ్ జోహర్ సినిమా షూటింగ్ లో ఉన్న అనుష్క కరీబియన్ టూర్ లో ఉన్న ప్రియుడు కోహ్లీని కలిసేందుకు వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల కథనం. మూడో టెస్టు సందర్భంగా సెయింట్ లూసియానా స్టేడియంలో స్టాండ్స్ లో కోహ్లీని ఉత్తేజపరిచిందని తెలుస్తోంది.