: నాతో నటించిన హీరోయిన్లంతా విజయవంతం కావడం సంతోషం: వెంకటేష్
తనతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్లంతా స్టార్ హీరోయిన్ హోదా అనుభవించడం తనకు సంతోషాన్నిస్తుందని విక్టరీ వెంకటేష్ తెలిపారు. ఖుష్బూ, దివ్యభారతి, టబూ, అంజలా జవేరీ, శిల్పాశెట్టి, ప్రీతి జింటా, కత్రినా కైఫ్ ఇలా ఎంతో మందిని తెలుగు తెరకు పరిచయం చేశానని, వారంతా స్టార్ హోదాను సొంతం చేసుకోవడం సంతోషమేనని వెంకీ తెలిపారు. తన గత సినిమాలను చూసి తానే ఆశ్చర్యపోతుంటానని ఆయన చెప్పారు. ఓవర్ ఏక్టింగ్ స్టేజ్ నుంచి సెటిల్డ్ యాక్టింగ్ స్టేజ్ కి మారిన విధానం చూసుకుని తానే విస్మయం చెందుతుంటానని ఆయన చెప్పారు. తనకు ఆర్టిఫిషియల్ గా నటించడం ఇష్టం ఉండదని, రావు గోపాలరావు, ఎస్వీఆర్, రేలంగి, అల్లు రామలింగయ్య వంటి నటుల నుంచి స్పూర్తి పొందానని వెంకటేష్ చెప్పారు. తానేం చేసినా అభిమానులు ఆదరించారని, అందుకు ధన్యవాదాలని ఆయన చెప్పారు. తాను యాక్షన్ సినిమాలు చేసినా, కుటుంబ కధా చిత్రాలు చేసినా, క్లాసిక్ సినిమాలు చేసినా, హాస్యరస చిత్రాలు చేసినా తనను ఆదరించారని ఆయన చెప్పారు.