: గృహహింస కేసు వాదిస్తున్న న్యాయవాదిని చితకబాదిన నిందిత న్యాయవాది
హైదరాబాద్ కు చెందిన బాలకృష్ణ అమోల్, దీక్ష అమోల్ భార్యభర్తలు. వృత్తి రీత్యా ఇద్దరూ న్యాయవాదులే. బాలకృష్ణ తనను వేధిస్తున్నాడంటూ భార్య దీక్ష ఆయనపై గృహహింస కింద కేసు పెట్టింది. ఎర్రమంజిల్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. దీక్ష అమోల్ తరఫు న్యాయవాది వసంత్ రావు దేశ్ పాండే కేసు వాదిస్తుండగా ఆగ్రహానికి గురైన బాలకృష్ణ సదరు న్యాయవాదిపై దాడికి పాల్పడ్డాడు. అతని చొక్కా పట్టుకుని బయటకు లాక్కొనివచ్చి దాడి చేశాడు. కోర్టు సిబ్బంది, అక్కడున్న వారు వారించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సంబంధిత అధికారులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలకృష్ణను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.