: నయీమ్ లాంటి హంతకుల హెచ్చరికలకు భయపడేది లేదు!: ఎమ్మెల్యే రామలింగారెడ్డి
నయీమ్ లాంటి హంతకుల హెచ్చరికలకు తాను భయపడేది లేదని దుబ్బాక ఎమ్మెల్యే సోలిశెట్టి రామలింగారెడ్డి అన్నారు. తనకు ప్రాణాలపై తీపి, డబ్బు మీద ఆశ రెండూ లేవన్నారు. సుమారు ఇరవై సంవత్సరాల క్రితం మెదక్ జిల్లా గిరాయిపల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ లోనే తాను అమరుడిని కావాల్సిందని, ఆ రోజు తన అదృష్టం బాగుందని కనుకనే బతికి బయటపడ్డానన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సూచనల మేరకు ఒక గన్ మన్ ను మాత్రమే పెట్టుకున్నానని, తనకు దుబ్బాక ప్రజలే రక్షణ కవచాలని రామలింగారెడ్డి పేర్కొన్నారు.