: బాగ్దాద్‌లో ప్రసూతి వార్డ్‌లో అగ్ని ప్రమాదం.. 11 మంది శిశువులు సజీవ దహనం
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఓ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 11 మంది శిశువులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం పట్ల అప్రమత్తమైన సిబ్బంది ఎంతగా ప్రయత్నించినా కొందరిని మాత్రమే రక్షించగలిగారు. 11 మంది శిశువులు సజీవ దహనం కావడంతో ఆసుపత్రి పరిసరాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదంలో ఓ తండ్రి తన కవల పిల్లలను కోల్పోయి రోదించడం అందరినీ కలచివేసింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని సిబ్బంది చెబుతున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టనున్నారు.