: బాన్సువాడలో కలకలం... వ్యక్తిపై కత్తులతో నలుగురి దాడి.. 18 కత్తిపోట్లు
నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడలో ఈరోజు కలకలం చెలరేగింది. నలుగురు వ్యక్తులు కత్తులతో హల్‌చల్ చేశారు. ఓ వ్యక్తిని టార్గెట్‌గా చేసుకొని అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ వ్యక్తి వారి నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అతనికి 18 కత్తిపోట్లతో తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలయిన సదరు వ్యక్తిని స్థానికులు నిజామాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.