: నిజామాబాద్ జిల్లాలో తరగతి గదిలోనే ఇద్దరు బాలికల ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియాల్‌లో ఇద్దరు బాలికలు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. పాఠశాలలోనే వారు ఈ ఘటనకు పాల్పడడం పట్ల ఇతర విద్యార్థులు ఆందోళన చెందారు. తాము చదువుకుంటోన్న ఉన్నత పాఠశాల తరగతి గదిలోనే ఇద్దరు బాలికలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు, స్థానికులు విద్యార్థినులను కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. బాలికల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాల గురించి తెలియాల్సి ఉంది.