: అందాల పోటీలపై దాడి చేస్తామంటున్న ఐఎస్... ‘మిస్ యూనివర్స్’ను లేపేస్తామని ప్రకటన!


మసీదులు, మార్కెట్లు, ప్రార్థనా మందిరాలు, జన సమ్మర్థం ఉండే ప్రాంతాలు, విదేశీ రాయబార కార్యాలయాలు... ఇలా ఉగ్రవాద సంస్థ ఐఎస్ టార్గెట్ చేయనిదంటూ లేదు. తాజాగా, జనవరిలో ఫిలిప్పీన్స్ లో జరగబోయే మిస్ యూనివర్స్ పోటీలను ఐఎస్ టార్గెట్ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఐఎస్సే ప్రకటించింది. ఫిలిప్పీన్స్ సపోర్టర్స్ అనే బృందానికి ఐఎస్ ఒక వీడియోను విడుదల చేసింది. ‘ఎవ్రీవన్ హూ కెన్’ పేరుతో టెలిగ్రామ్ మెసెంజర్ ద్వారా విడుదల చేసిన ఈ వీడియోలో... ఎవరైనా సరే జనవరిలో జరిగే ‘మిస్ యూనివర్స్’ పోటీలపై దాడి చేయడానికి సిద్ధం కావచ్చని పేర్కొంది. ఆ పోటీల్లో ‘మిస్ యూనివర్స్’గా గెలిచే వారిని హతమార్చేందుకు ఒక బాంబు తయారు చేయాలని జీహాదీలకు సూచించింది. ఆత్మాహుతి దాడి కోసం వాడే బెల్ట్ లు, దుస్తులను ఎలా తయారు చేయాలో కూడా ఆ వీడియోలో వివరించారు. అంతేకాకుండా, ఐఎస్ కు వ్యతిరేకంగా యుద్ధం చేసిన విదేశీయులను లక్ష్యంగా చేసుకుని వారిని హతమార్చేందుకు ప్రాణ త్యాగానికి సిద్ధమయ్యేవాళ్లంతా ముందుకు రావాలని కోరింది. ఆత్మాహుతి దాడుల సమయంలో వాడే బెల్ట్ లు, పేలుడు పదార్థాలను ఎలా తయారు చేయాలో తెలియజెప్పే సమాచారమున్న ఒక ఇంగ్లీషు గైడ్ ను ఏ విధంగా డౌన్ లోడ్ చేసుకోవాలో కూడా ఆ వీడియోలో చూపించారు.

  • Loading...

More Telugu News