: ప్రధానిపై విమర్శలు ఆపండి: బీజేపీ ఎమ్మెల్యే ప్రభాకర్


ప్రధాని నరేంద్ర మోదీపై చేస్తున్న లేనిపోని విమర్శలు ఆపాలని ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అందులో భాగంగా ఎన్నో ఏళ్లుగా మూతబడ్డ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు కేంద్రం ముందుకు వచ్చిందని ఆయన చెప్పారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి పనులకు కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారని, ఇలా అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని, వారే కాంగ్రెస్ ను తరిమికొడతారని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News