: ‘ఇండిగో’ ఆఫర్... జమ్ము- శ్రీనగర్ టిక్కెట్ రూ.806
ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఇండిగో’ తమ ప్రయాణికులకు ప్రమోషనల్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా మాత్రమే వర్తించే ఈ ఆఫర్ తో ఈ నెల 18 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు ప్రయాణించవచ్చు. ఆ వివరాలు... జమ్ము - శ్రీనగర్ టిక్కెట్ రూ.806, ఢిల్లీ - జైపూర్ రూ.908, చెన్నై- బెంగళూరు రూ.976, బెంగళూరు - కొచ్చి రూ.1,137 మాత్రమే ఉంటుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే, ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది, ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనే విషయాలను ‘ఇండిగో’ తన వెబ్ సైట్ లో ప్రస్తావించలేదు.