: నక్సలైట్లను ఏరివేసేందుకు నయీమ్ ను పెంచి పోషించింది ప్రభుత్వాలే: సీపీఐ నారాయణ


కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ను పెంచి పోషించింది ప్రభుత్వాలేనని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నక్సలైట్లను ఏరివేసేందుకు ప్రభుత్వాలే నయీమ్ ను పెంచిపోషించాయని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుండడంతో నయీమ్ ను అంతమొందించారని ఆయన ఆరోపించారు. లేనిపక్షంలో నయీమ్ కు ఎలాంటి ఇబ్బంది కలిగి ఉండేదికాదని, నయీమ్ ఎన్ కౌంటర్ కు తాము వ్యతిరేకం కానప్పటికీ...అతని డైరీల్లో దొరికిన సమాచారంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జీఎస్టీ బిల్లు ఆమోదానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చూపిన శ్రద్ధ ఏపీకి ప్రత్యేకహోదా ఇప్పించడంపై చూపిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. ప్రత్యేకహోదాకు మద్దతు తెలిపిన పార్టీలతో కలసి ఉద్యమం చేసి, కేంద్రంపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై తామంతా పోరాటానికి కలిసి వస్తుంటే జగన్ ఒంటరిగా బంద్ కు పిలుపునివ్వడంలో పరమార్థం తమకు అర్థం కాలేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News