: కృష్ణా పుష్కరాల స్పెషల్!... విశాఖ- విజయవాడ- తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ రైలు!
ఎల్లుండి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలకు రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పుష్కరాలు జరిగే ప్రాంతాలకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల నుంచి ఇఫ్పటికే ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే కొద్దిసేపటి క్రితం మరో ప్రత్యేక ప్రకటన చేసింది. పుష్కర భక్తుల సౌకర్యార్థం విశాఖ- విజయవాడ- తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ రైలును నడపనున్నట్లు ధక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర ప్రకటించారు. పుష్కరాలకు తరలివచ్చే భక్తుల కోసం 13 రైల్వే స్టేషన్లలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు ఆయన ప్రకటించారు.