: శ్రీకాళహస్తి ఆలయం వద్ద మద్యపానం!
రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తి ఆలయం వద్ద నేడు ముగ్గురు వ్యక్తులు మద్యం సీసాలతో పట్టుబడ్డారు. ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా రాహుకేతు పూజా కౌంటర్ల వద్ద వీరు మద్యం సేవిస్తూ భద్రత సిబ్బంది కంటబడ్డారు. కాగా, ఆలయం వద్ద ఎప్పుడూ పటిష్ట భద్రత ఉంటుందని, మద్యం బాటిళ్ళు ఎలా వచ్చాయన్న విషయం విచారణ జరుపుతామని భద్రతాధికారులు చెప్పారు.