: కృష్ణమ్మకు పుష్కర శోభ!... శోభాయాత్రతో రేపు సాయంత్రం ప్రారంభం కానున్న పుష్కరాలు!


కృష్ణా నది పుష్కర శోభ సంతరించుకుంది. ఎల్లుండి (ఈ నెల 12వ తేదీ) నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలకు సర్వం సిద్ధమైంది. కృష్ణా నది పరీవాహక ప్రాంతం ఉన్న తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలు, ఏపీలోని కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాల్లో భారీ సంఖ్యలో పుష్కర ఘాట్లను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలిరానున్న వేలాది మంది భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. రేపు సాయంత్రం విజయవాడలో నిర్వహించనున్న శోభాయాత్రతో పుష్కరాలు రేపు రాత్రికే ప్రారంభం కానున్నాయి.

  • Loading...

More Telugu News