: జగ్గారెడ్డి అరెస్ట్!... సంగారెడ్డిలో హైటెన్షన్!


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల పక్షాన మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) నేటి ఉదయం ఆమరణ దీక్షకు పూనుకున్నారు. అయితే దీక్షకు తాము అనుమతి ఇవ్వలేదని చెప్పిన పోలీసులు జగ్గారెడ్డి దీక్షను అనుమతించబోమని చెప్పారు. పోలీసుల అనుమతి లేకున్నా... దీక్ష చేసి తీరతానని జగ్గారెడ్డి ప్రకటించారు. అనుకున్నట్లుగానే భారీ అనుచరగణంతో దీక్షా స్థలికి చేరుకున్న జగ్గారెడ్డి దీక్షకు దిగారు. అయితే అప్పటికే అక్కడకు భారీ సంఖ్యలో తరలివచ్చిన పోలీసు బలగాలు జగ్గారెడ్డిని అరెస్ట్ చేశాయి. ఈ సందర్భంగా జగ్గారెడ్డి వర్గీయులు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News