: శ్రీవారిని దర్శించుకున్న క్రిష్-రమ్య... ప్రత్యేక పూజలు నిర్వహించిన నవదంపతులు
రెండురోజుల క్రితం ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్)-రమ్యల వివాహం హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్‌లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నవదంపతులు ఈరోజు తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ దర్శనంలో వీరిరువురు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయంలో వెంకన్నకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ అధికారుల నుంచి క్రిష్-రమ్యలు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.