: సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ లోనూ నయీమ్ హస్తం!... సీబీఐకీ పట్టుబడని గ్యాంగ్ స్టర్!
తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసుల తూటాలకు హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కు చెందిన పలు ఆసక్తికర విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మావోయిస్టుగా ఉన్న సమయంలో సీనియర్ ఐపీఎస్ అధికారి వ్యాస్ హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న నయీమ్... ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. తదనంతరం పోలీసులకు కోవర్టుగా మారిన నయీమ్ పలువురు పౌర హక్కుల సంఘం నేతలను హత్య చేశాడు. ఈ క్రమంలో గురజాత్ లో బీజేపీ సర్కారును ఇరకాటంలో పెట్టిన సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ లోనూ నయీమ్ కు పాత్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 2005లో జరిగిన ఈ ఘటనలో నాడు గుజరాత్ హోం మంత్రిగా ఉన్న ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో కేసు దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన సీబీఐ... నయీమ్ కోసం ముమ్మర గాలింపు చేపట్టింది. అప్పటికే అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయిన నయీమ్ ఆచూకీ కనుగొనడంలో సీబీఐ అధికారులు విఫలమయ్యారు.