: టార్గెట్ చేసిన వారికి అందమైన అమ్మాయిలను ఎర వేసే నయీమ్!


గ్యాంగ్ స్టర్ నయీమ్ హత్యానంతరం ఇప్పటికే వేల కోట్ల విలువైన ఆస్తులు, ఖరీదైన ఆభరణాలు, భూ పత్రాలు బయటకు రాగా, తాజాగా నయీమ్ దుర్మార్గాలకు సంబంధించిన కొత్త విషయాలు బయటకు వచ్చాయి. తాను టార్గెట్ చేసిన వారికి అందమైన అమ్మాయిలను ఎరగా వేసి, వారు ట్రాప్ లో పడేట్టు చేయడంలోనూ నయీమ్ సిద్ధహస్తుడని తెలుస్తోంది. ఆ పని చేసేందుకు స్వయంగా ఎంపిక చేసుకున్న వారిని వినియోగించాడని పోలీసులు పసిగట్టారు. ఎక్కడికైనా సెటిల్ మెంట్లు జరిపేందుకు వెళ్లాల్సి వస్తే, తనతో పాటు మహిళలను, యువతులను వాహనంలో వెంట బెట్టుకుని వెళ్తాడని, అలా చేస్తే పోలీసులు అంత సులువుగా అనుమానించరన్నది నయీమ్ ఉద్దేశం. ఇదే సమయంలో సోదాలు చేయాలనుకున్నా జంకి పైపైనే చూసి పంపేస్తారని నమ్మే నయీమ్, చుట్టూ ఆడవాళ్లను పెట్టుకుని తిరుగుతూ ఉంటాడని పోలీసు వర్గాలు అంటున్నాయి. అందంగా ఉండి చిన్న వయసులో భర్తను కోల్పోయిన వారు, అనాధలైన వారికి ఆశ్రయం పేరిట లోబరచుకుని వారిని వాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు. నయీమ్ హత్యానంతరం అరెస్టయిన ఇద్దరు యువతులు కూడా వంటవారు కాదని, అల్కాపురి ఇంట్లో ఎన్నడూ వంట చేసిన దాఖలాలు లేవని పోలీసులు చెబుతున్నారు. హోటళ్ల నుంచి తెచ్చుకుని తినే వారు. వంట మనిషిగా చెబుతున్న ఫర్హానాను సెక్యూరిటీగా మాత్రమే వాడుకున్నారని వివరించారు.

  • Loading...

More Telugu News