: భోగలాలసత్వంలో నయీమ్!... గ్యాంగ్ స్టర్ కు ప్రాణాంతక వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ!


తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాల చేతిలో ప్రాణాలు విడిచిన గ్యాంగ్ స్టర్ నయీమ్ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడట. భోగలాలసత్వంతో విలాసవంతమైన జీవితం గడిపిన కారణంగానే అతడు ఆ వ్యాధి బారిన పడ్డాడట. ఈ మేరకు హైదరాబాదులోని నెక్ నాంపూర్ లోని అతడి ఇంటిలో సోదాలు చేసిన పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించుకున్నారు. సదరు ఇంటిలో ఇద్దరు మహిళలతో పాటు ఏడుగురు అమ్మాయిలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు... ప్రాణాంతక వ్యాధికి చికిత్స తీసుకుంటున్న క్రమంలో నయీమ్ వాడుతున్న మందులను కూడా కనుగొన్నారు. తన అవసరాలకు అమ్మాయిలను వాడుకునే నయీమ్... ఆ తర్వాత వారిని ఇతర రాష్ట్రాలకు విక్రయించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కోణంలోనూ పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News